ఎండలకు మనోళ్లు బీర్లు గటగట తాగేశారు.. రెండు నెలల్లోనే 14 కోట్ల బీర్లు అమ్మకాలు

ఎండలకు మనోళ్లు బీర్లు గటగట తాగేశారు.. రెండు నెలల్లోనే 14 కోట్ల బీర్లు అమ్మకాలు
  • ఎండ దెబ్బకు బీర్లు గటగట.. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేలో 14 .22 కోట్ల బీర్లు హాంఫట్​ 
  • నిరుడు 2 నెలల్లో 10.46 కోట్ల బీర్ల అమ్మకాలు
  • ఈ ఏడాది నాలుగు కోట్ల పైనే ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా సేల్స్​ 
  • 2025లో రెండు నెలల్లో వచ్చింది రూ.5,627 కోట్లు
  • ఈసారి ఏప్రిల్​, మేలో రూ.7,374 కోట్ల ఇన్​కం
  • పెరిగిన లిక్కర్​ ఆదాయం కూడా..
  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3,618 కోట్లు, 
  • మేలో రూ. 3775. 93 కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్ సిటీ, వెలుగు:రాష్ట్రంలో ఏప్రిల్, మే రెండు నెలల్లోనే మందుబాబులు దాదాపు 14. 22 కోట్ల బీర్లు తాగేయడంతో సరికొత్త రికార్డు నమోదైంది. ఎండలు దంచి కొట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా  నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.  గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా10 కోట్ల 46 లక్షల బీర్లు అమ్ముడుపోగా, ఈసారి ఆ అమ్మకాలు ఏకంగా 14 కోట్ల 22 లక్షలకు చేరుకున్నాయి.  అంటే 4 కోట్లకు పైగా బీర్లు ఎక్కువగా సేల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 

ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో బీర్లకు డిమాండ్ ఊహించని స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,620  వైన్ షాపులు, 1,200కు పైగా బార్లు ఉన్నాయి.  ఇందులో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోనే దాదాపు 700కు పైగా వైన్స్‌‌‌‌‌‌‌‌లు, బార్లు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్,  సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రం మొత్తం బీర్ల వినియోగంలో దాదాపు ఇక్కడే సగం వరకు నమోదవుతోంది.  

సాధారణంగా రోజుకు 1.5 లక్షల కేసులు అమ్ముడవుతుండగా, ప్రస్తుతం రోజువారీ అమ్మకాలు 2.2 లక్షల నుంచి 2.3 లక్షల కేసులకు చేరుకున్నాయి.  ప్రతి కేసులో 12 బీర్ బాటిళ్లు ఉంటాయి.   నిరుడు ఏప్రిల్ నెల మొత్తంలో 46. 46 లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో  ఏకంగా 56.21 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.  దీంతో 20.99 శాతం బీర్ల అమ్మకాలు ఒక్క ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లోనే  పెరిగాయి. 

కాగా.. మే నెలలో దాదాపు 62.40 లక్షల బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. గతేడాది మే మొత్తం 50 లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోగా.. ఈసారి దాదాపు 12 లక్షల కేసుల బీర్ల వరకు ఎక్కువగా సేల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 

లిక్కర్ ​సేల్స్‌‌‌‌‌‌‌‌ కూడా పెరిగినయ్​

రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ ( ఐఎంఎఫ్ఎల్ ) సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. 2026 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఐంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ (లిక్కర్) 31.07 లక్షల కేసులు అమ్ముడవగా..  నిరుడు ఏప్రిల్ లో 31.18 లక్షల కేసులు సేల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీంతో హార్డ్ లిక్కర్ అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్ లో  0.35 శాతం తగ్గాయి.  దీనికి కారణం బీర్లు ఎక్కువగా తాగడమే అని తెలుస్తోంది.  అయితే,  2025 మే నెలలో 25 లక్షల ఐఎంఎఫ్ఎల్  లిక్కర్ కేసులు అమ్ముడుపోగా దాదాపు 2 కోట్ల 65 లక్షల 92 వేల లిక్కర్ బాటిళ్లు తాగారు.  

ఈ ఏడాది మేలో దాదాపు 28 లక్షల ఐఎంఎఫ్ఎల్  లిక్కర్ సేల్స్ జరగ్గా..  3 కోట్ల 36  లక్షల లిక్కర్ సీసాలు తాగారు.  ఈ ఏడాది ఏప్రిల్ నెల మొత్తం లిక్కర్ అమ్దానీ రూ. 3,618.41 కోట్లు వచ్చింది.  నిరుడు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  రూ. 3,272.33 కోట్లు రాగా.. 10.58 శాతం ఎక్కువగా ఆదాయం సమకూరింది.  2026  మే నెల మొత్తంలో రూ. 3,775. 93 కోట్ల ఇన్ కం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్30న ఒక్క రోజే 3.62 లక్షల కేసుల ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ (హార్డ్ లిక్కర్ ), 5.04 లక్షల కేసుల బీర్లు అమ్ముడు కాగా  రూ. 423.57 కోట్ల ఆదాయం సమకూరింది.  

ఇందులో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే దాదాపు 40 శాతం పైగా అమ్మకాలు జరిగాయి. నిరుడు ఏప్రిల్ 30న రూ. 346.62 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరగ్గా..  దాదాపు ఒకే రోజు దాదాపు రూ. 78 కోట్ల వరకు ఎక్కువ ఆదాయం వచ్చింది.  మే 30, 31 తేదీల్లోనే రూ.464.46 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.   ఇదే నెలలో ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 28 లక్షల కేసులు అమ్ముడుకాగా..  నిరుడు రూ. 25 లక్షల కేసుల వరకు సేల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రూ.10  వేల కోట్ల ఆదాయం 

మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. నిరుడితో పోలిస్తే ఈసారి బీర్ విక్రయాలు గణనీయంగా పెరగడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన టైంలో రూ. 10  వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం, ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది.  దీనికి మద్యం అమ్మకాలతో పాటు లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు రుసుములు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.  

2025, 2026 మే నెలల్లో మద్యం అమ్మకాల వివరాలు (మే 1 నుంచి మే 31 వరకు)

మద్యం రకం    2026    2025

హార్డ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్ అమ్మకాలు    28 లక్షల కేసులు    25  లక్షల కేసులకుపైగా
బీర్ అమ్మకాలు    62. 42 లక్షల కేసులు    50  లక్షల కేసులకుపైగా
మొత్తం అమ్మకాల విలువ      రూ.3,775.93   కోట్లు    రూ.2,335 కోట్లు