V6 News

సైబర్ క్రైం విచారణకు సునీల్ కనుగోలు డుమ్మా!

సైబర్ క్రైం విచారణకు సునీల్ కనుగోలు డుమ్మా!

కాంగ్రెస్ వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. కేసుకు సంబంధించి ఇవాళ ఆయన సీసీఎస్ కు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఆయనతో పాటు మరో ముగ్గురు వార్ రూం సభ్యులకు సైతం పోలీసులు 10 ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరుకాలేమని చెప్పిన ఆ ముగ్గురు అధికారులను మరో 10 రోజుల గడువు కోరినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు ఇటీవలే దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీప్రతాప్‌, శశాంక్‌, ఇషాన్‌ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు సోదాలు  నిర్వహించిన సమయంలో సునీల్‌ విదేశాల్లో ఉన్నారు. దీంతో భారత్కు తిరిగి వచ్చిన అనంతరం పోలీసులు ఆయనకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు.