బిష్కెక్ (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్ లలిత్ సెహ్రావత్ రజతం గెలవగా.. మాజీ చాంపియన్ సునీల్ కుమార్ కాంస్యం అందుకున్నాడు. నితేశ్ ఫైనల్ దూసుకెళ్లడంతో ఇండియాకు మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన గ్రీకో రోమన్ 55 కేజీ ఫైనల్ బౌట్‌లో లలిత్ 0–9తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇక్తియోర్ బొటిరోవ్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు.
87 కేజీ కేటగిరీ కాంస్య పతక పోరులో సునీల్ కుమార్ 5–4తో రసూలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించాడు. మరోవైపు 97 కేజీ సెమీఫైనల్లో నితేశ్ 7–2తో చైనా రెజ్లర్ జెగాంగ్ వాంగ్ చిత్తు చేశాడు. 82 కేజీల విభాగం సెమీఫైనల్లో 0–10 తేడాతో మొహమ్మదిన్ హొస్సేని (ఇరాన్) చేతిలో ఓడిన ప్రిన్స్ కాంస్య పతకం కోసం తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన దిదార్‌తో తలపడనున్నాడు. ఇక, 77 కేజీల కాంస్య పతక పోరులో స్టార్ రెజ్లర్ అమన్ 14–15 తేడాతో యెన్‌గున్ నొహ్ (సౌత్ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
