‘సీపీఎస్’ రథయాత్రకు గ్రూప్ –1 ఆఫీసర్ల మద్దతు

‘సీపీఎస్’  రథయాత్రకు గ్రూప్ –1 ఆఫీసర్ల  మద్దతు

హైదరాబాద్,వెలుగు : సీపీఎస్ ను రద్దుచేసి  పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని ఈనెల 16 నుంచి సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్  చేపట్టనున్న " పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర"కు గ్రూప్ –1 అధికారుల సంఘం మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, సెక్రటరీ  హనుమంతు నాయక్ తదితరులు ఆవిష్కరించారు.