సిరిసిల్లలో భారీ చోరీ.. ఏకంగా ఏటీఎం మెషీన్నే ఎత్తుకెళ్లారు.!

సిరిసిల్లలో భారీ చోరీ.. ఏకంగా ఏటీఎం మెషీన్నే ఎత్తుకెళ్లారు.!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అత్యంత సాహసోపేతంగా  భారీ చోరీకి పాల్పడ్డారు. పట్టపగలు కాదు.. జన సంచారం లేని తెల్లవారుజామున, ఏకంగా ఎస్బీఐ  ఏటీఎం యంత్రాన్నే పెకిలించి వాహనంలో ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ ఘటనలో దొంగల తెగింపు పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఈ చోరీ జరిగిన ఏటీఎం కేంద్రం, పోలీస్ స్టేషన్‌కు కేవలం కూతవేటు దూరంలోనే ఉంది. ఖాకీలు పక్కనే ఉన్నారన్న భయం లేకుండా యంత్రాన్ని వాహనంలో ఎక్కించుకుని పారిపోవడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.చోరీ సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ నాగేంద్ర చారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ , సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.