- అంబేద్కర్ కాలేజీలో బహుళ భాషా జాతీయ సదస్సు
ముషీరాబాద్, వెలుగు: నేటి ప్రపంచీకరణ యుగంలో వృత్తిపరంగా రాణించాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నా బహుళ భాషలపై పట్టు సాధించడం అవసరమని ప్రముఖ కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీలో జరిగిన బహుళ భాషా జాతీయ సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష తెలుగును మరువకూడదని, తెలుగుపై పట్టు ఉంటే ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ప్రొఫెసర్ క్రిష్టోఫర్ మాట్లాడుతూ.. ఉపాధి కల్పనలో భాషా నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వివిధ భాషల్లో పరిశోధనా పత్రాలు సమర్పించిన 60 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సీఈవో లింబాద్రి, ప్రిన్సిపాల్ మట్ట శేఖర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
