హైదరాబాద్ సిటీ, వెలుగు: హెల్మెట్, హెల్మెట్ పట్టీ పెట్టుకోకుండా బైక్లు నడుపుతున్న వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేశారు. కమిషనరేట్పరిధిలో 9, 10వ తేదీల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టగా, హెల్మెట్ పెట్టుకోని 3,072 మందికి, హెల్మెట్ పెట్టుకుని పట్టీ పెట్టుకోని 173 మందికి చలానాలు విధించారు. స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హనుమంతరావు పాల్గొన్నారు.
