దివ్యాంగులకు కేంద్రం అండగా ఉంటుంది : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

దివ్యాంగులకు కేంద్రం అండగా ఉంటుంది :  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్ల ఐసీడీఎస్ ప్రాంగణంలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, ఏఎల్ఐఎంసీవో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తన విజ్ఞప్తి మేరకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆరు క్యాంపులు నిర్వహించి అర్హులను గుర్తించారని, వారికి ఇప్పుడు పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 13, 15 తేదీల్లో శంషాబాద్, సరూర్ నగర్ ప్రాంతాల్లోనూ అర్హులకు పరికరాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.