ఇరాన్ అమెరికా శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతున్న వేళ బులియన్ మార్కెట్లలో కొత్త జోష్ నెలకొంది. యుద్ధం ఆగిపోతుందనే భరోసాతో ఇన్వెస్టర్లు ఈ లోహాలపై తిరిగి పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలకు తిరిగి లెక్కలు వస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
ఏప్రిల్10న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.152 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 300గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 025గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 65వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి.
