‘సమ్మక్క’ వర్సిటీతో ఐఐటీహెచ్ ఎంవోయూ..ట్రైబల్ యూనివర్సిటీ అభివృద్ధికి కీలక అడుగు

‘సమ్మక్క’ వర్సిటీతో ఐఐటీహెచ్ ఎంవోయూ..ట్రైబల్ యూనివర్సిటీ అభివృద్ధికి కీలక అడుగు

హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివ ర్సిటీ అభివృద్ధికి కీలక అడుగు పడింది. ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ టెక్నాలజీ హైద రాబాద్ (ఐఐటీహెచ్), ట్రైబల్ వర్సిటీ మధ్య శుక్రవారం పలు అంశాల్లో ఎంవోయూ కుది రింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్​ రెడ్డి సమక్షంలో ఐఐటీహెచ్​ డైరెక్టర్ బీఎస్.మూర్తి, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి సమ్మక్క వర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌లో బీటెక్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌‌‌‌లో, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్‌‌‌‌లో బీఎస్(బ్యాచిలర్​ఆఫ్​సైన్స్) కోర్సులు ప్రారంభం కానున్నాయి. వీటి బోధనకు సంబంధించి వర్సిటీ లెక్చరర్లకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. కొత్త పాఠ్య ప్రణాళికలు, ల్యాబ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ సహకరించనుంది. 

పేరు నేనే సూచించా: కిషన్ రెడ్డి

ప్రధాని మోదీ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు సమ్మక్క వర్సిటీని ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచనను గౌరవించామని, ఈ వర్సిటీకి సమ్మక్క -సారక్క అమ్మవార్ల పేరు పెట్టాలని తానే ప్రధాని మోదీకి సూచించానని, ఆయన వెంటనే ఆమోదం తెలిపారన్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ వర్సిటీ భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ సంస్థగా ఎదుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.