అహ్మదాబాద్: టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తొలి మ్యాచ్ అయినప్పటికీ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నే సిక్స్ బాది తానెంత కసిమీదున్నాడో చెప్పాడు. అదే ఊపులో బౌండరీలు బాదుతూ 28 బాల్స్ ల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ(12) వెంటనే ఔట్ కావడంతో కోహ్లీ స్థానంలో క్రీజులోకొచ్చిన స్కై ఎలా ఆడతాడోనని అంతా అనుకున్నారు. కానీ వచ్చీ రావడంతోనే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుపడడం మొదలు పెట్టాడు.
అయితే రాహుల్(14), కెప్టెన్ కోహ్లీ(1) వెంటవెంటనే ఔవుట్ కావడంతో సూర్య నెమ్మదించాడు. రిషబ్ పంత్(18)తో కలిసి వికెట్ పడకుండా కాపాడుకున్నాడు. అయినప్పటికీ చెత్త బాల్స్ ను బౌండరీలుగా మలుస్తూ అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే సూర్య తన 57 పరుగుల దగ్గర శామ్ కర్రన్ బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

