Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి తాజాగా ఓ లగ్జరీ ఫ్లాట్ ని కొనుగోలు చేసింది. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర ఏకంగా రూ.7.18 కోట్లు.. ముంబైలోని ఓ ప్రముఖ కంపెనీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇదే ప్రాజెక్టులో సూర్యకుమార్ యాదవ్- దేవిశా శెట్టి దంపతులు రెండు ఫ్లాట్లను కొన్నారు.
2025లో 17, 18వ అంతస్తుల్లో రెండు ఫ్లాట్లు కొనుగోలు చేసిన దేవిశా శెట్టి.. తాజాగా 18వ అంతస్తులోనే మరో ఫ్లాట్‌ను కూడా దక్కించుకుంది. ఈ ఫ్లాట్‌ను ఫిబ్రవరి 20వ తేదీన రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. స్టాంప్ డ్యూటీగా రూ.35.90 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.30 వేలు చెల్లించినట్లు తెలుస్తుంది. రెండు కార్ పార్కింగ్ స్థలాలతో కూడిన ఈ ఫ్లాట్ ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకున్నట్లు టాక్.
ముంబైలోని తూర్పు ప్రాంతంలోని చెంబూర్‌కు సమీపంలో ఉన్న డియోనార్ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. చెంబూర్ హార్బర్ లైన్ రైల్వే స్టేషన్, ముంబై మోనోరైల్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, సియాన్–పన్వెల్ ఎక్స్‌ప్రెస్‌వే లాంటి ప్రధాన రవాణా మార్గాల ద్వారా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో చదరపు గజం సగటు ధర రూ.52,433గా ఉంది.
ALSO READ : భారత్ సింపుల్గా సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో తెలుసా?
ఇదిలా ఉండగా, ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బిజీగా ఉన్నాడు. భారత జట్టు గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో గెలచి అజేయంగా సూపర్-8కు అర్హత సాధించింది. కానీ సూపర్-8లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు క్లిష్టం అయ్యాయి. ఇక ఈరోజు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారీ తేడాతో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని చూస్తుంది భారత జట్టు.
