హైదరాబాద్: సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరువురు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు ఛాలెంజ్ చేశారు. ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి సుమారు 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‌లో మంగ్లీలో ప్రమేయం లేకపోతే గురువారం (ఏప్రిల్ 16) బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ విసిరారు.
తాను కూడా బాధితులను తీసుకుని వస్తా అక్కడే చర్చిద్దామన్నారు. ఈ స్కామ్‌లో మంగ్లీ, ఆమె సోదరుడికి ప్రమేయం ఉన్న ఆధారాలు ఇప్పటికే తాను బయటపెట్టానని.. కావాలంటే మరోసారి చూపిస్తానని అన్నారు. తాను 10 లక్షలు డిమాండ్ చేశానని మంగ్లీ ఆరోపించిందని.. దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు మూడు వందల కోట్ల స్కామ్ జరిగిందని.. తన క్లయింట్ రూ.10 కోట్లు మోసపోయాడని తెలిపారు. ఈ కేసులో సైలెంట్ అయితే రూ.10 లక్షలు ఇస్తానని మంగ్లీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఆరోపించాడు.

