V6 News

ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి.. తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డ్

ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా వైశాలి.. తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డ్

సైప్రస్: ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి చరిత్ర సృష్టించింది. 2026 ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచింది. బుధవారం (ఏప్రిల్ 15) సైప్రస్‎లో జరిగిన ఫైనల్ రౌండ్‎లో కాటెరినా లాగ్నోపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చివరి రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో 8.5 పాయింట్లతో టోర్నీని కైవసం చేసుకుంది. 

తద్వారా ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆర్.వైశాలి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో 2026 చివర్లో జరిగే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‎కు వైశాలి అర్హత సాధించింది. చైనాకు చెందిన జు వెన్జున్‌తో మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం వైశాలి తలపడనుంది.