తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ అరాధే ప్రమాణం

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ అరాధే ప్రమాణం

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై జస్టిస్ అలోక్ అరాధేతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండయ్యారు. 

ప్రమాణస్వీకారం తర్వాత గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జస్టిస్ అలోక్ కు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. కొద్దిరోజుల క్రితం హైకోర్టు సీజేగా ఉన్న జస్టిజ్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. 

ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు.