ఈవీ రెవల్యూషన్... స్విచ్ బైక్ సెంటర్ లాంచ్

ఈవీ రెవల్యూషన్... స్విచ్ బైక్ సెంటర్ లాంచ్

పర్యావరణ అనుకూల ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్లలో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న స్విచ్ బైక్ తన కొత్త ఎక్స్‌ క్లూజివ్ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్ - ఎంవీ ఆటోమొబైల్స్ ప్రారంభించింది.

 

హైదరాబాద్‌లో సమీపంలోని ప్లాట్ నెం. 6, సర్దార్ పటేల్ రోడ్, ఆనంద్ థియేటర్ పక్కన, మోచి షోరూమ్ పక్కన, బేగంపేట్ రోడ్, పైగా కాలనీలో ఈ షోరూం నెలకొంది.

మహేష్, సాయి వినీత్, నాలం రోహిత్ ఎంవీ ఈ ఆటోమొబైల్స్‌ కి సారథ్యం వహిస్తారు. ఈవీ పరిశ్రమలోని వివిధ రంగాలలోవ్యవహరించే బహుళ కంపెనీలకు మార్కెట్ తెరిచి ఉండడం, ప్రజలు వాటిని ఆదరించడం వల్ల హైదరాబాద్‌లోని ఈవీ మార్కెట్ ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఉండటం వలన వినియోగ దారులు ఎంచుకోవడానికి 300 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్‌లు, బహుళ బ్రాండ్‌ల సాధికారికతను పొందుతున్నారు.