ఈరోజుల్లో ఇంటికో ఇన్ ఫ్లుయెన్సుర్ అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. యూట్యూబ్ చానళ్ళు, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నవారు ఎక్కువైపోయారు. సోషల్ మీడియాను ద్వారా సంపాదించడం తప్పేమి కాదు కానీ.. కొంతమంది తక్కువ సమయంలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఈ కోవకే చెందుతాడు ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వ్యక్తి. తన ఛానల్ కి సుబ్స్క్రైబర్స్ ని పెంచుకునేందుకు ఏకంగా కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు ఈ వెధవ. ఇతను చేసిన పనికి నెటిజన్స్ చివాట్లు పెడుతున్నారు. వీడు ఏం చేశాడో తెలిస్తే మీకు నాలుగు తగిలిద్దామా అన్నంత కోపం వస్తుంది.
‘ఒక్కసారి సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఒక్కొక్కరి దగ్గర సబ్‌స్క్రైబ్ చేయించుకున్నందుకు ఒక్కో లడ్డూ ఇస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
►ALSO READ | తమిళనాడు ఆలయాల్లో మొబైల్స్ బ్యాన్..ఇవాళ్టి(సెప్టెంబర్1) నుంచే అమల్లోకి
30 మంది దగ్గర సబ్‌స్క్రైబ్ చేయించుకుని 30 లడ్డూలు పంచినట్లు తెలిపాడు షణ్ముగం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వ్యవహారంపై సీరియస్ అవుతున్నారు హిందువులు, శ్రీవారి భక్తులు. శ్రీవారి ప్రసాదాన్ని తన ప్రచారానికి వాడటంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.ఇంతకీ అతనికి అంత పెద్ద మొత్తంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎలా వచ్చింది అన్న చర్చ జరుగుతోంది.
టీటీడీ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు శ్రీవారి భక్తులు. ఈ ఘటనపై విచారణ జరిపి షణ్ముగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
