కేసు పెట్టకుండా ఉండేందుకు లంచం.. ఏసీబీకి  దొరికిన  టోలిచౌకి ఎస్‌ఐ

కేసు పెట్టకుండా ఉండేందుకు లంచం.. ఏసీబీకి  దొరికిన  టోలిచౌకి ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ మరో పోలీసు అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్. పండు నాయక్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.

బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చి.. ఫిర్యాదుదారుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయకుండా ఉండేందుకు ఎస్‌ఐ పండు నాయక్ 10 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు.

బాధితుడి నుంచి ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో దాడి చేసిన ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు.. 10వేల రూపాయల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ప్రయోజనాల కోసం విధులను దుర్వినియోగం చేసిన ఎస్‌ఐని అరెస్ట్ చేశారు.

నిందితుడైన ఎస్‌ఐ పండు నాయక్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. విచారణ అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.