అప్పుడు 4 గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఛాంపియన్.. ఇప్పుడు రాంచీ రోడ్లపై కూరగాయల వ్యాపారం.. అమర్‌దీప్ కుమార్ హృదయ విదారక గాథ..!

అప్పుడు 4 గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఛాంపియన్.. ఇప్పుడు రాంచీ రోడ్లపై కూరగాయల వ్యాపారం.. అమర్‌దీప్ కుమార్ హృదయ విదారక గాథ..!

అతనో స్టార్ అథ్లెట్.. త్రోబాల్‎లో తన అద్భుత ప్రదర్శనతో నాలుగు సార్లు ఇండియాకు గోల్డ్ మెడల్స్ సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించాడు. యావత్ దేశం గర్వపడేలా చేసిన అతడు ఇప్పుడు దీనస్థితి అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు పోడియంపై గోల్డ్ మెడల్స్ అందుకున్న అతడు.. ఇప్పుడు రోడ్డు పక్కన ఫుట్ పాత్‎పై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడే భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్, నాలుగు సార్లు గోల్డ్ మెడల్ విజేత అమర్‌దీప్ కౌర్‌. అంతర్జాతీయ వేదికలపై ఇండియాను తలెత్తుకునేలా చేసిన అమర్‎దీప్ జార్ఖండ్ రాజధాని రాంచీ విధుల్లో కూరగాయాలు అమ్ముకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. దేశానికి మెడల్స్ అందించిన అతడు ఎందుకు కూరగాయాల అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్‌దీప్ కుమార్ భారత స్టార్ త్రోబాల్ అథ్లెట్. త్రోబాల్‎లో భారతదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన అతడు 4  గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2015లో ఆసియా జూనియర్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌, 2017, 2019, 2026 సీనియర్ త్రోబాల్ పోటీల్లో కూడా బంగారు పతకాలు గెలుపొందాడు. 

నాలుగు బంగారు పతకాలతో అంతర్జాతీ వేదికలపై భారత దేశ కీర్తిని చాటిన అతడు తన సొంత రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం, ఆర్థిక సహయం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా లాభం లేదు. ఇదే సమయంలో తనతో ఆడిన ప్లేయర్స్‎కు వాళ్ల రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. కానీ జార్ఖండ్ ప్రభుత్వం తనను పట్టించుకోకపోవడంతో అమర్‏దీప్ తీవ్ర అసంతృప్తి గురయ్యాడు.

 అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే. దీంతో చేసేదేమిలేక కుటుంబాన్ని పోషించడానికి రాంచీలోని అర్గోడా చౌక్ వద్ద తన తండ్రి కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముతూ ఫ్యామిలీకి ఆసరాగా నిలుస్తున్నారు. పార్ట్-టైమ్‌గా క్యాబ్ (టాక్సీ) కూడా నడుపుతున్నాడు. దేశానికి మెడల్స్ అందించిన అమర్ దీప్ రోడ్డు పక్కన కూరగాయాలు అమ్ముకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

►ALSO READ | ఈ నవవధువు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! వరద నీటిలో చిక్కుకున్న బైకర్ కోసం దేవుడిలా వచ్చారు...!

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. అమర్‌దీప్ కుమార్ కూరగాయలు తూకం వేస్తుండగా ఆయన వెనుక ఉన్న గోడకు అతడు సాధించిన మెడల్స్ వేలాడుతూ కనిపించాయి. ఇది చూసిన నెటిజన్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ వంటి పాపులర్ ఆటలకు ఇచ్చే ప్రాధాన్యతను ఇతర క్రీడలకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. 

పతకాలు సాధించి దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాళ్లకు కనీస గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శిస్తున్నారు. సత్తా ఉన్న ఆటగాళ్లను తొక్కేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోని దేశానికి నాలుగు గోల్డ్ మెడల్స్ అందించిన అమర్ దీప్‎ను ఆదుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.