హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు టీ-మొబైల్ భారీ టెక్నాలజీ సెంటర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు టీ-మొబైల్ భారీ టెక్నాలజీ సెంటర్
  • ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదు.. రెండేళ్ల కష్టం
  • మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
  • మన యువ ప్రతిభ ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు
  • 'టీ-మొబైల్' జీటీసీ ప్రారంభోత్సవంలో మంత్రి వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు గత రెండేళ్లుగా బలమైన ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేశామని, ఈ మార్పు రాత్రికి రాత్రే వచ్చింది కాదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని యువత ప్రతిభ కేవలం ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదని ఆయన స్పష్టం చేశారు. టెలికాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్స్, బీఎఫ్ఎస్ఐ, రిటైల్ వంటి వివిధ రంగాల్లోని క్లిష్టమైన సవాళ్లను మన ఇంజినీర్లు, ఇన్నోవేటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం 'టీ-మొబైల్ యూఎస్' (టీఎంయూఎస్) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ను మంత్రి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐటీ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీటీసీని ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చినప్పుడు, వారికి అత్యంత ప్రతిభావంతులైన టెక్నాలజీ నిపుణులను అందిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చామన్నారు.

అందుకు అనుగుణంగానే ప్రస్తుతం వందలాది మంది నిపుణులైన ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించామని, కంపెనీలు తమ వ్యాపారాలను వేగంగా విస్తరించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు.