ఇవ్వాల్టి నుంచి ఓయూలో ‘తక్ష్–2023’ వేడుకలు

ఇవ్వాల్టి నుంచి ఓయూలో ‘తక్ష్–2023’ వేడుకలు

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘తక్ష్– 2023’ వేడుకలు ఇవ్వాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్​సీసీ గేటు వరకు 2కే రన్ నిర్వహించను న్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. స్టూడెంట్లు, ఫ్యాకల్టీ ఇన్​టైమ్​లో ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకోవాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న వర్సిటీలోని అన్ని డిపార్ట్​మెంట్లను స్టూడెంట్ల సందర్శన కోసం ఓపెన్ చేయనున్నారు. 26న టాగూర్ ఆడిటోరియంలో సెమినార్ జరగనుంది.