నెక్లెస్ రోడ్ లో మహిళాబంధు వేడుకలు

నెక్లెస్ రోడ్ లో  మహిళాబంధు వేడుకలు

హెల్త్   ఎడ్యుకేషన్ పైన  రాష్ట్ర ప్రభుత్వం  ఫోకస్ చేస్తోందన్నారు  మంత్రులు మహమూద్ అలీ, తలసాని  శ్రీనివాస్ యాదవ్. వచ్చేసారి  నుంచి  ఒకటో   తరగతి నుండి  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని  తెలిపారు. మహిళల భద్రత  కోసం  షీ-టీమ్స్ ఏర్పాటు  చేశామన్నారు.  అమ్మఒడి,  కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్  లాంటి పథకాలను   కేసీఆర్ సర్కార్  అమలు చేస్తుందన్నారు  మంత్రులు. ప్రపంచ మహిళా  దినోత్సవం సందర్భంగా  నెక్లెస్ రోడ్డులోని  పీపుల్స్ ప్లాజాలో  మహిళాబంధు  వేడుకలు జరిగాయి. మంత్రి  తలసాని మాట్లాడుతుండగా జీహెచ్ఎంసి  మహిళా కార్మికుల  ఆందోళన చేపట్టారు.  జీతాలు పెంచాలని,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇవ్వాలని డిమాండ్   చేశారు. ఎన్నిసార్లు   అడిగినా మాట  దాటేస్తున్నారని  మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.