హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పేదలకు అత్యంత విలువైన ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చామని బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్లీడర్తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 30 నెలలైనా హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టివ్వలేదని చెప్పారు. గురువారం ఆయన ఎమ్మెల్సీలు వాణిదేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో నినాదం మాటలకే పరిమితమైందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లంటూ మంత్రులు హడావుడి తప్ప ఇంకేం లేదని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం 7 నుంచి 8 వేల ఇండ్లు కట్టాలనుకుంటున్నది. అది కూడా ఇందిరమ్మ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే లబ్ధిదారులు 6 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం అంటోంది. సర్కారు ఇండ్లు కట్టిస్తే స్వాగతిస్తం కానీ.. పేద వాళ్లకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలి. సింగిల్‌బెడ్‌రూమ్ ఇండ్లను ఒప్పుకోం. ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందే. ఖాళీగా ఉన్న 39 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం ఇవ్వాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
