రూపాయికే చికెన్ బిర్యానీ..కొనేందుకు ఎగబడిన జనం

రూపాయికే చికెన్ బిర్యానీ..కొనేందుకు ఎగబడిన జనం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా. నాన్ వెజ్ తింటే కరోనా వస్తుందని…ముఖ్యంగా చికెన్ ద్వారా వస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో పూర్తిగా నష్టపోకుండా ఉన్న స్టాక్ ను అమ్ముకునేందుకు వ్యాపారులు ధరలను తగ్గించి అమ్ముతున్నారు. అయినా చికెన్ ప్రియులు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే రూపాయికే  చికెన్ బిర్యానీ అని బోర్డు పెట్టడంతో కొనుగోలు చేసేందుకు…ఎగబడ్డారు జనం.

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరిలో కొత్తగా బిర్యానీ సెంటర్ ను ప్రారంభించారు. అంతేకాదు ప్రజలను ఆకట్టుకునేందుకు ఓ ఆఫర్ ను పెట్టారు. అదే రూపాయికి చికెన్ బిర్యానీ. అంతే కరోనా అనే విషయాన్ని కూడా పక్కన బెట్టి…బిర్యానీని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అంతేకాదు హోటల్ ముందు భారీ సంఖ్యలో బారులు తీరారు.  ఎంతగా అంటేన వారిని అదుపు చేసేందుకు పోలీసులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు  అమ్మకాలు ప్రారంభం కాగా… కేవలం రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ సేల్ అయ్యింది.

అయితే కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో…లేదోనని మొదటి భయపడ్డామని  తెలిపారు హోటల్ నిర్వాహకులు. కేవలం రెండు గంటల్లోనే బిర్యానీ మొత్తం అమ్ముడు పోవడం సంతోషంగా ఉందన్నారు.