హైదరాబాద్​ హాస్టల్స్​ ను తనిఖీ చేసిన టాస్క్​ఫోర్స్​..30 హాస్టల్స్​ కు నోటీసులు.. ఐదు హాస్టళ్ల కిచెన్​ లు సీజ్​

హైదరాబాద్​ హాస్టల్స్​ ను తనిఖీ చేసిన టాస్క్​ఫోర్స్​..30 హాస్టల్స్​ కు నోటీసులు.. ఐదు హాస్టళ్ల కిచెన్​ లు సీజ్​

 

హైదరాబాద్ నగరంలో మొన్నటి దాకా హోటళ్లు,ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలపై దాడులు చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ...తాజాగా హాస్టళ్లు, పీజీలపై దృష్టి సారించారు. హోటళ్లు, హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తోంది.నగరంలో పలు హాస్టళ్లను  జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేశాయి. నిబంధనలు పాటించని 30 హాస్టళ్లకు నోటీసులు జారీచేసిన అధికారులు.. 5 హాస్టళ్ల కిచెన్స్​ను సీజ్​ చేసి ...రూ. 2.50 లక్షలు జరిమానా విధించారు

అమీర్​ పేట్, అశోక్ నగర్, దిల్​సుఖ్​ నగర్ లోని ప్రైవేట్ హాస్టల్స్ ను  ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ తో పాటుగా ఇతర శాఖల తో కలిసి టాస్క్ ఫోర్స్ టీం గా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.ఫుడ్ సేఫ్టీ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు టాస్క్​ఫొర్స్​ బృందం గుర్తించింది. 

సెల్లార్లను, పార్కింగ్ ప్లేస్ లను కిచెన్, మెస్ ల కోసం వాడుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించి ... పెద్ద హోర్డింగ్‌ లను ప్రదర్శిస్తున్న హాస్టల్ యజమానులకు నోటీసులు జారీచేశారు. చిన్న గదుల్లో ఉంచుతూ,  సరైన మరుగుదొడ్లు  లేకుండా... కనీస సౌకర్యాలను కల్పిచడం లేదు. 58 హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించగా 30 హాస్టల్స్ కి నోటీసులిచ్చిన అధికారులు 5 హాస్టల్స్ కిచెన్స్ ను సీజ్ చేశారు.