టెలికంకు టాటా ‘టాటా’

టెలికంకు టాటా ‘టాటా’

    రూ.50 వేల కోట్లు కట్టింది

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు తన మొబైల్‌ ఫోన్‌ వ్యాపారాన్ని అమ్మేయడానికి టాటా గ్రూపు తన లెండర్లకు, ప్రభుత్వానికి 7.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) చెల్లించింది. ఎయిర్‌టెల్‌లో విలీనం కావడానికి ఈ కంపెనీ రెండేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గత నెల టెలికం శాఖకు రూ.10 వేల కోట్లు చెల్లించింది. అంతకుముందే టాటా టెలిసర్వీసెస్‌ (మహారాష్ట్ర)కు ఉన్న రూ.40 వేల కోట్ల అప్పులను తీర్చేసింది. షెడ్యూలు ప్రకారమే కన్జూమర్‌ మొబైల్‌ బిజినెస్‌ విభాగానికి ఉన్న అప్పులను చెల్లించామని టాటా టెలిసర్వీసెస్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు.  జియో 2016లో రంగప్రవేశం చేసిన తరువాత టాటా, ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌ వంటి కంపెనీలు పోటీలో నిలబడలేకపోయాయి. కొన్ని దివాలా తీయగా, టాటా వంటివి ఇతర కంపెనీల్లో విలీనం అయ్యాయి.