
న్యూఢిల్లీ: డీలర్లకు లోన్లను ఇప్పించేందుకు సబ్సిడరీ కంపెనీలు టాటా ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) , టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) లు బజాజ్ ఫైనాన్స్‌తో పార్టనర్‌షిప్ కుదుర్చుకున్నాయని టాటా మోటార్స్ ప్రకటించింది.
ఎంఓయూ ప్రకారం, బజాజ్ ఫైనాన్స్‌కు ఉన్న నెట్‌వర్క్‌ను ఈ రెండు సబ్సిడరీ కంపెనీలు వాడుకోనున్నాయి. తమ డీలర్లకు ఆర్థికంగా సాయం చేయనున్నాయి. డీలర్ పార్టనర్ల వర్కింగ్ క్యాపిటల్ మెరుగుపడడానికి ఈ పార్టనర్‌షిప్ సాయపడుతుందని టీపీఈఎం సీఎఫ్‌ఓ, టీఎంపీవీ డైరెక్టర్ ధిమన్ గుప్తా అన్నారు.