టీసీఎస్ సీఈఓ శాలరీ రూ.28 కోట్లు.. సగటు ఉద్యోగి జీతం కంటే 332.8 రెట్లు ఎక్కువ

టీసీఎస్ సీఈఓ శాలరీ రూ.28 కోట్లు.. సగటు ఉద్యోగి జీతం కంటే 332.8 రెట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌) సీఈఓ కే కృతివాసన్ 2025-–26 ఆర్థిక సంవత్సరంలో  రూ.28 కోట్లకు పైగా శాలరీ ప్యాకేజీని (రెమ్యునిరేషన్‌‌ను) అందుకున్నారు. కంపెనీ యాన్యువల్ రిపోర్ట్‌‌ ప్రకారం.. ఈయన జీతం ఏడాది లెక్కన  6.3శాతం పెరిగింది. 

ఇది సంస్థలోని సగటు ఉద్యోగి  జీతం కంటే 332.8 రెట్లు ఎక్కువ. ఈ ప్యాకేజీలో రూ.1.67 కోట్ల జీతం, రూ.1.44 కోట్ల అలవెన్సులు,  రూ.25 కోట్ల కమిషన్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి రూ.28 కోట్లు అవుతాయి.