ఎనిమిది ఆఫీసులను మొదలుపెట్టనున్న టీసీఎస్

ఎనిమిది ఆఫీసులను మొదలుపెట్టనున్న టీసీఎస్

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొత్తగా ఎనిమిది ఆఫీసులను మొదలుపెట్టనుంది. ఒక్కోదాంట్లో పది వేల మంది కూర్చోవచ్చు. వీటిలో కొన్ని సెంటర్లు మెట్రోయేతర నగరాల్లో రానున్నాయి. ఈ పెద్ద క్యాంపస్‌‌‌‌లను  పూర్తి చేయడానికి 3-5 సంవత్సరాలు పడుతుంది. కంపెనీ ‘‘25 బై 25 మోడల్‌‌‌‌’’కు అనుగుణంగా  ఇవి ఉంటాయి. 2025 నాటికి 25 శాతం మంది ఎంప్లాయీస్​ మాత్రమే ఆఫీసుల నుంచి పనిచేస్తారు. ఈ కొత్త స్పేస్‌‌‌‌లను పర్యావరణానికి అనుకూలంగా నిర్మిస్తున్నారు.  టీసీఎస్​ పోయిన సంవత్సరంలో లక్షకుపైగా ఉద్యోగులను చేర్చుకుంది.  జూన్ 2022 నాటికి దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలకు చేరింది. భువనేశ్వర్, కొచ్చి, తిరువనంతపురం, నాగ్‌‌‌‌పూర్, ఇండోర్, వారణాసి, బరోడా, భోపాల్  గాంధీనగర్ వంటి నగరాల్లో కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. చాలా మంది తమ ఇళ్లను తమ సొంతూళ్లకు మార్చిన తర్వాత బేస్ లొకేషన్‌‌‌‌లకు తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు. వీరిని తిరిగి ఆఫీసులకు తీసుకురావడానికి గువాహటి, నాగ్‌‌‌‌పూర్,  గోవా వంటి నాన్-మెట్రో ప్రాంతాలలో టీసీఎస్ ఆఫీసులను నిర్మిస్తోంది.  దేశంలోని ఏ ఆఫీసు నుంచి  అయినా ఉద్యోగులు తమ సిస్టమ్‌‌‌‌లతో పనిచేసుకోవడానికి  వీలుగా  ఒకేషనల్​ ఆపరేటింగ్ జోన్‌‌‌‌లను,  హార్డ్​డిస్క్‌‌‌‌లను ఏర్పాటు చేశామని కంపెనీ తెలిపింది.