టీచర్ల వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పక్కాగా అమలు చేయాలి :  నవీన్ నికోలస్

టీచర్ల వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పక్కాగా అమలు చేయాలి :  నవీన్ నికోలస్
  •  డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో టీచర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థులు ఎక్కువగా ఉండి, టీచర్లు తక్కువగా ఉన్న స్కూళ్లకు మిగులు టీచర్లను పంపే ‘వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్’ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్.. డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా మిగులు స్కూళ్ల నుంచి అవసరమున్న బడులకు వెళ్లిన టీచర్ల విషయంలోనూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూళ్లలో ఆయా సబ్జెక్టు టీచర్ల అవసరం ఇంకా ఉంటే, వారిని విధుల నుంచి రిలీవ్ చేయకుండా అక్కడే కొనసాగించాలని సూచించారు. కాగా, స్కూళ్లలో బోధన సాఫీగా సాగేందుకు జూన్ 20 నాటి విద్యార్థుల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. స్కూళ్ల వారీగా, సబ్జెక్టుల వారీగా విద్యార్థుల నిష్పత్తిని విశ్లేషించి, ఎక్కడైతే టీచర్ల అవసరం ఎక్కువగా ఉంటుందో అక్కడికి మిగులు టీచర్లను పంపాలని స్పష్టం చేసింది. 

కలెక్టర్ల అనుమతితోనే ఖాళీల భర్తీ

పదవీ విరమణలు, దీర్ఘకాలిక సెలవులు, ఇతర కారణాలతో ఏవైనా బడుల్లో అకస్మాత్తుగా ఖాళీలు ఏర్పడితే, వాటిని వెంటనే భర్తీ చేయాలని నవీన్ నికోలస్ సూచించారు