ప్రీ వెడ్డింగ్ మర్డర్.. ఇప్పుడు కొత్త ట్రెండ్.. ఏం నటించావమ్మా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే !

ప్రీ వెడ్డింగ్ మర్డర్.. ఇప్పుడు కొత్త ట్రెండ్.. ఏం నటించావమ్మా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే !

హనీమూన్లో భార్య చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ ఘటన తరహాలోనే దేశవ్యాప్తంగా మరో ఘటన చర్చనీయాంశమైంది. కాకపోతే.. అది హనీమూన్ మర్డర్.. ఇది ప్రీ వెడ్డింగ్ మర్డర్. కేతన్ అగర్వాల్‌‌కు, సియా గోయల్తో వివాహం నిశ్చయమైంది.

కాబోయే వాడిపై ప్రేమ నటిస్తూ.. ప్రపోజ్ చేస్తే పళ్లికిలిస్తూ.. రొమాంటిక్ డేట్లో డ్యాన్స్ చేస్తూ.. నిజంగానే అతనంటే ప్రేమ, ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించింది. కానీ.. రియాలిటీలో మాత్రం విష నాగులా అతనిని కాటేసింది. కేతన్ అగర్వాల్‌‌, సియా గోయల్ ఉదంతానికి సంబంధించి వీడియోలు వైరల్గా మారాయి. సియా, కేతన్‌లు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఎంగేజ్మెంట్ చేసుకున్న నెల రోజుల తర్వాత సియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొవ్వొత్తులతో ఉన్న కేక్ ఫొటో పోస్ట్ చేసింది. "నా హృదయం తన గమ్యాన్ని చేరి నెల రోజులు అయిన సందర్భంగా శుభాకాంక్షలు" అనే క్యాప్షన్ పెట్టి, కేతన్‌ను ట్యాగ్ చేసింది. అంతలా కేతన్పై ప్రేమ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చింది. మే నెలలో పెట్టిన మరో పోస్ట్‌లో కేతన్ సియాకు పువ్వు ఇస్తుండగా.. ఆమె బదులిస్తూ 'పసంద్ హై తుమ్హే' (నాకు నువ్వంటే ఇష్టం) అనే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు" అని క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇంతగా ఇష్టపడి ప్రేమించిన మనిషిని చంపేయడానికి సియాకు మనసెలా వచ్చిందని నెటిజన్లు భగ్గుమన్నారు.

కేతన్ హత్యకు సియా ఎలా ప్లాన్ చేసిందంటే..
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడనుకున్న  బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. అతడి కాబోయే భార్యే, ప్రియుడితో కలిసి లోయలోకి నెట్టి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్‌‌కు, సియా గోయల్​తో వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో పెండ్లి జరగాల్సి ఉంది.

జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు కలిసి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్‌‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే కోటపై ఫొటోలకు పోజులు ఇస్తుండగా కేతన్ కాలుజారి లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌‌ మూడు గంటల పాటు శ్రమించి లోయ నుంచి కేతన్ మృతదేహాన్ని వెలికితీసింది.

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసును నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సియాను ప్రశ్నించగా పొంతనలేని జవాబులిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. నిందితురాలి మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, స్పాట్‌‌లో ఉన్న మరికొందరి స్టేట్‌‌మెంట్లను సేకరించగా అసలు నిజం బయటపడింది. కేతన్‌‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సియా, తన పుట్టినరోజు నెపంతో అతడిని లోహగఢ్ కోటకు పిలిపించింది. అక్కడ సమయం చూసి ప్రియుడు చేతన్ సహాయంతో కేతన్‌‌ను లోయలోకి నెట్టేసింది.