కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ).
మొత్తం ఖాళీలు: 100.
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్ 61, ఫైనాన్స్ & అకౌంట్స్ 18, స్టోర్స్ & పర్చేజ్ 21.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష–-2024 రాసి తుది ఎంపికకు సిఫారసు కాని వారై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 33 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 23.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జులై 13.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ csir.res.inను సందర్శించండి.
►ALSO READ | CISFలో పారామెడికల్ పోస్టులు : ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ చేసినోళ్లకు ఛాన్స్..
