‘ప్రజల కోరిక మేరకే ఇంగ్లీష్ మీడియంలో బోధన’

‘ప్రజల కోరిక మేరకే ఇంగ్లీష్ మీడియంలో బోధన’

విశాఖ: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధించాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ స్పందించారు.  ప్రజల అభ్యర్ధన మేరకే వైఎస్  జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అనే అంశాన్ని చేర్చారని… ఇప్పుడు అదే అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని సీఎం ను కోరుతానని అన్నారు. తెలుగును ఒక  సబ్జెక్ట్ గా  ప్రవేశపెట్టే జీఓ 81 వల్ల లాభమే జరుగుతుందని యార్లగడ్డ అన్నారు. ఈ జీఓ వల్ల అన్ని సీబీఎస్సీ, ఐసీఎస్సీ , ఓక్రిడ్జ్ పాఠశాలల్లో తెలుగుభాష కనిపిస్తుంది,వినిపిస్తుందని ఆయన తెలిపారు.

Teaching in the English medium in AP Schools, Yarlagadda prasad comment

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి