రాఫెల్​కు దీటుగా తేజస్

రాఫెల్​కు దీటుగా తేజస్

నేవీ, ఎయిర్​ఫోర్స్​ కోసం రెండు వెర్షన్లు

నేవీకి టీఈడీబీఎఫ్​, ఎయిర్​ఫోర్స్​కు ఓఆర్​సీఏ

మామూలు తేజస్​తో పోలిస్తే మరింత పవర్​ఫుల్​

రెండు ఇంజన్లతో ఎక్కువ రేంజ్​, ఎక్కువ స్పీడ్​

వెపన్లు, సెన్సర్లు సహా అన్నీ దేశీవే

కేంద్రం డబ్బులిస్తే ఆరేళ్లలో నేవీకి తొలి విమానం

12 ఏళ్లలో అన్ని విమానాలూ సిద్ధం

ఒకప్పుడు రష్యా నుంచి మిగ్​, సుఖోయ్​లు. ఇప్పుడు ఫ్రాన్స్​ నుంచి రాఫెల్​. ఎప్పుడూ మన విమాన సేనకు విదేశీ యుద్ధ విమానాలే బలంగా, అస్త్రాలుగా మారాయి. మరి, మనం సొంతంగా యుద్ధ విమానాలను తయారు చేసుకోలేమా? రాఫెల్​కు దీటుగా పవర్​ఫుల్​ ఎయిర్​క్రాఫ్ట్​లకు రూపునివ్వలేమా? హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​– హాల్​), ఏరోనాటికల్​ డిజైన్​ ఏజెన్సీ (ఏడీఏ)లు కలిసి ప్రొటోటైప్​ ‘తేజస్​’ యుద్ధ విమానాలను డిజైన్​ చేశాయి. తేజస్​ ఏంటి.. ఇప్పటికే ఉన్నాయి కదా అన్న అనుమానం వచ్చిందా? హాల్​, ఏడీఏలు డిజైన్​ చేసింది తేజస్​కు అడ్వాన్స్​డ్​ మోడల్​ విమానాలను. ప్రస్తుతం అవి డిజైన్​ల వరకే పరిమితమయ్యాయి. తమ డిజైన్లు, వార్​ఫేర్​కు కేంద్రం ఓకే చెప్పి బడ్జెట్​ ఇస్తే, 12 ఏళ్లలో వాటిని తయారు చేసిస్తామని హాల్​ చెబుతోందని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా విమానాలు.. వాటి కథేందో చూద్దాం!!

నేవీకి ఒక రకం.. ఎయిర్​ఫోర్స్​కు ఇంకో రకం

హాల్​, ఏడీఏలు నేవీ, ఎయిర్​ఫోర్స్​ కోసం రెండు రకాల తేజస్​ అడ్వాన్స్​డ్​ యుద్ధ విమానాలకు డిజైన్లు తయారు చేశాయి. నేవీ కోసం ట్విన్​ ఇంజన్​ డెక్​ బేస్డ్​ ఫైటర్​ (టీఈడీబీఎఫ్​), ఎయిర్​ఫోర్స్​ కోసం ఓమ్ని రోల్​ కంబాట్​ ఎయిర్​క్రాఫ్ట్​ (ఓఆర్​సీఏ)కు డిజైన్​ రెడీ చేశాయి. నేవీ యుద్ధ విమానాలతో పోలిస్తే ఎయిర్​ఫోర్స్​ కోసం తయారు చేసే రకం కొంచెం తక్కువ బరువుతో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు ఓ టన్ను వరకు తక్కువుంటుందట. నేవీ వేరియంట్​ అయితే, ఎయిర్​క్రాఫ్ట్​ కారియర్​ డెక్​పై దిగడం, టేకాఫ్​ కావడానికి ల్యాండింగ్​ గేర్​ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి టీఈడీబీఎఫ్​ బరువు ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు, రాఫెల్​ విమానాలకు పెడుతున్న ఖర్చు కన్నా తక్కువకే ఈ విమానాల తయారీ ఖర్చు ఉంటుందట. ఇండియా స్పెసిఫిక్​ ఎన్​హాన్స్​మెంట్​ ప్యాకేజీ కింద 36 రాఫెల్​ విమానాలను రూ.12,780 కోట్లు పెట్టి కొంటున్న సంగతి తెలిసిందే. నేవీ వేరియంట్​లో ఒక్కో విమానానికి రూ.538 కోట్ల దాకా ఖర్చవుతుందని దానిని డిజైన్​ చేసినోళ్లు చెబుతున్నారు. ఎయిర్​ఫోర్స్​ వేరియంట్​కు నేవీ వేరియంట్​తో పోలిస్తే రూ.35 కోట్ల నుంచి రూ.71 కోట్లు తక్కువే అవుతుందంటున్నారు. కేంద్రం తమ ప్రాజెక్టుకు ఓకే చెప్పి నిధులు విడుదల చేస్తే ఆరేళ్లలో తొలి విమానాన్ని అందిస్తామంటున్నారు.

పరికరాలు, మిసైళ్లు అన్నీ దేశీనే

ఇటు టీఈడీబీఎఫ్​, అటు ఓఆర్​సీఏల్లో మొత్తం సొంతంగా తయారు చేసుకున్న అత్యాధునిక రక్షణ పరికరాలనే వాడుతున్నట్టు వాటి డిజైనర్లు చెబుతున్నారు. ఒకేసారి సముద్రం, నేలపైన టార్గెట్లను అత్యంత కచ్చితత్వంతో ట్రాక్​ చేసే యాక్టివ్​ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్​ రాడార్​ (ఏఈఎస్​ఏ)లను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏదైనా మిషన్​ సందర్భంగా ముఖ్యమైన సెన్సర్​ సమాచారాన్ని భద్రంగా చేరేవేసేందుకు మేడిన్​ ఇండియా డేటా లింకులు, కమ్యూనికేషన్​ సిస్టమ్​లూ వాటిలో పెడతారట. అంతేగాకుండా ఇటీవలే టెస్ట్​ చేసిన ‘అస్త్ర’ వంటి మేడిన్​ ఇండియా లాంగ్​ రేంజ్​ ఎయిర్​ టు ఎయిర్​ మిసైల్స్​నూ వాటికి అమర్చొచ్చని చెబుతున్నారు.

750 విమానాలు కావాలి

2030 నుంచి 2050 మధ్య ఇండియాకు దాదాపు 750 దాకా యుద్ధ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు. 2040 నాటికి ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో అత్యంత కీలకమైన సుఖోయ్​ 30ఎంకేఐతో పాటు చాలా యుద్ధ విమానాలు రిటైర్​ అయిపోతాయని, వాటికి రీప్లేస్​మెంట్లు తప్పనిసరి అని చెబుతున్నారు. కాబట్టి ఆ దిశగా టీఈడీబీఎఫ్​ కీలక యుద్ధ విమానంగా మారుతుందని ధీమాగా చెబుతున్నారు. టీఈడీబీఎఫ్​, ఓఆర్​సీఏతో పాటే స్టెల్త్​ ఫైటర్​ అడ్వాన్స్​డ్​ మీడియం కంబాట్​ ఎయిర్​క్రాఫ్ట్​ (ఏఎంసీఏ)లను సమాంతరంగా తయారు చేస్తామని చెబుతున్నారు. తేజస్​తో పోలిస్తే ఆ మూడు రకాలు కొంచెం ఖర్చుతో కూడుకున్నవేనంటున్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే ఏఎంసీఏని 2040 వరకల్లా తయారు చేసిస్తామని చెబుతున్నారు. రాఫెల్​కు దీటుగా తేజస్​ టీఈడీబీఎఫ్​ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని, సెన్సర్లు చాలా అడ్వాన్స్​డ్​గా పనిచేస్తాయని చెబుతున్నారు. మేడిన్​ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తే దేశ ఏరోస్పేస్​ పవర్​కు కొత్త శక్తి వచ్చినట్టేనని అంటున్నారు.

మామూలు తేజస్​ కన్నా పవర్ఫుల్

కొన్ని వారాల్లో మనం సొంతంగా తయారు చేసుకున్న లైట్​ కంబాట్​ ఎయిర్​క్రాఫ్ట్​ (ఎల్​ఏసీ) తేజస్​ (హాల్​ తయారు చేసింది) మన ఎయిర్​క్రాఫ్ట్​ కారియర్​ ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యపై ల్యాండ్​ కాబోతోంది. తొలిసారిగా నేవీలోకి అది చేరుతోంది. అయితే, అది అమెరికా తయారు చేసిన జనరల్​ ఎలక్ట్రిక్​ ఎఫ్​404–జీఈ–ఐఎన్​20 సింగిల్​ ఇంజన్​తోనే నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తేజస్​ను మరింత పవర్​ఫుల్​గా తీర్చిదిద్దేందుకు రెండు జనరల్​ ఎలక్ట్రిక్​ ఎఫ్​414 ఇంజన్లతో ట్విన్​ ఇంజన్​ డెక్​ బేస్డ్​ ఫైటర్​ను డిజైన్​ చేస్తున్నాయి హాల్​, ఏడీఏలు. దాని వల్ల ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు వెపన్స్​ పేలోడ్​ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేగాకుండా వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎయిర్​క్రాఫ్ట్​ కారియర్​పై సేఫ్​గా దిగేలా, అక్కడి నుంచి మరింత సేఫ్​గా టేకాఫ్​ అయ్యేలా ఈ రెండు ఇంజన్లు చూస్తాయంటున్నారు.

సూపర్ స్పీడ్

బరువు, వేగం విషయంలోనూ తేజస్​తో పోలిస్తే టీఈడీబీఎఫ్​ అడ్వాన్స్​డ్​గానే ఉంటుందని డిజైనర్లు చెబుతున్నారు. తేజస్​ మార్క్​1 (13.5 టన్నులు), 2030 నాటికి ఎయిర్​ఫోర్స్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తేజస్​ మార్క్​2 (17.5 టన్నులు)తో పోలిస్తే టీఈడీబీఎఫ్​ (23 టన్నులు) ఎక్కువ బరువు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్​ నేవీ ఆపరేట్​ చేస్తున్న మిగ్​29కే సైజంత ఉంటుందని అంటున్నారు. అంతేగాకుండా షిప్​ డెక్కులపై స్పేస్​ను సేవ్​ చేసేలా టీఈడీబీఎఫ్​ రెక్కలు మలుచుకుంటాయని, అది మరో స్పెషాలిటీ అని అంటున్నారు. మాక్​1.6 స్పీడ్​తో గంటకు దాదాపు 2 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని చెబుతున్నారు.