వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీకి తేజస్వి యాదవ్.. అసలు ఏమైందంటే..?

వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీకి తేజస్వి యాదవ్.. అసలు ఏమైందంటే..?

పాట్నా: ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ సోమవారం వీల్‌‌‌‌‌‌‌‌చైర్‌‌‌‌‌‌‌‌లో బిహార్ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున సోమవారం శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే కార్యక్రమానికి ఆయన అటెండ్ అయ్యారు. ఇటీవల తేజస్వి ఎడమ కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ ​చేసి కాలి గోరును తొలగించారు. దీంతో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. కాగా, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మీడియాతో తేజస్వీ మాట్లాడుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.