శివుడి వేషంలో మాజీ సీఎం కొడుకు

శివుడి వేషంలో మాజీ సీఎం కొడుకు

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి వేషం కట్టాడు. పరమ శివుడి వేషధారణలోనే ఆయన శంకరుడి పూజలో పాల్గొన్నారు. నడుముకు పులితోలు చుట్టి… జుట్టు విరబోసి.. మెడలో రుద్రాక్షలు.. విభూతి బొట్లు.. ఇలా.. తన ఆహార్యంలో ఆయన శివుడిని తలపించారు. పాట్నాలోని ఓ శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఇలాకనిపించాడు.

గతేడాది కూడా ఇదే సమయంలో శివారాధన చేశారు ఈ బిహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి. దేవ్ గఢ్ లోని బాబా వైద్యనాథ్ ధామ్ ఆలయంలోనూ.. పట్నాలోని పగోడాలోనూ పూజలు చేసే సమయంలో.. శివుడి ఆకృతిలో ఢమరుకం మోగిస్తూ కనిపించారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఓసారి శ్రీకృష్ణుడి వేషధారణలో ఫ్లూట్ వాయిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.