- 7, 11, 15, 17 ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు కేబినెట్ ఓకే
హైదరాబాద్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెరిగాయి. మూడేండ్ల నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా.. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. ఆ ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా తాజాగా రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగు ప్యాకేజీల పనులకు సంబంధించి 40 శాతం వరకు అంచనా వ్యయాలను పెంచేందుకు ఓకే చెప్పింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో.. ప్రాజెక్టులోని 7, 11, 15, 17 ప్యాకేజీలకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్యాకేజీ 7లో భాగంగా ఏదుల రిజర్వాయర్‌తో వట్టెం రిజర్వాయర్‌ను కలిపేలా నిర్మిస్తున్న కెనాల్లో 6.4 కిలోమీటర్ నుంచి 25.4 కిలోమీటర్ వరకు ట్విన్ టనెల్ నిర్మాణానికి గతంలో రూ.2,263.10 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. అయితే, తాజాగా మరో రూ.918 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రూ.3,181.10 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, ప్యాకేజీ 11లో భాగంగా వట్టెం రిజర్వాయర్ బండ్ ఫార్మేషన్కు రూ.1,680.70 కోట్లతో ఎస్టిమేట్స్ ఇవ్వగా.. ఇప్పుడు దానికి అదనంగా రూ.682.75 కోట్లు పెంచి రూ.2,363.45 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు ఓకే చెప్పారు. ప్యాకేజీ15లోని కురుమూర్తిరాయ రిజర్వాయర్ కోసం రూ.976.70 కోట్లతో శాంక్షన్ ఇవ్వగా.. ఇప్పుడు అదనంగా రూ.491.85 కోట్లు పెంచారు. దీనికి రూ.1,468.55 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు కేబినెట్ ఓకే చెప్పింది. ప్యాకేజీ 17లో ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ఫార్మేషన్ కోసం రూ.643 కోట్లతో శాంక్షన్ ఇవ్వగా.. ఇప్పుడు అదనంగా రూ.260.78 కోట్లు పెంచి రూ.903.78 కోట్లకు రివైజ్ చేశారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
