వైద్యారోగ్యశాఖలో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం .. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు

వైద్యారోగ్యశాఖలో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం .. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖలో 20 కేటగిరీల్లో వివిధ విభాగాల్లో మొత్తం 51,451 మంది ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

వీరి కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దీంతో గత మూడు నెలలుగా ఈ ఉద్యోగులకు జీతాలు అందలేదు. తాజాగా, ప్రభుత్వం వీరి సర్వీస్‌‌‌‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సర్వీస్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌టెన్షన్ చేసినట్టు ప్రకటించింది.