రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఆంధ్నప్రదేశ్​ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో వారి నివాసానికి వెళ్లి కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. సమాజ సేవకు జీఎన్ నాయుడు తన వంతు కృషి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా జీఎన్ నాయుడుతో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.