ఎల్ నినో ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. వర్షాకాలం మొదలై నెలరోజులు దాటినా చినుకు పడలేదు.. కాలం కాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఎప్పుడు చినుకు పడుతుందా అని ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రతి యేటా ఈ సమయానికి విత్తనాలు వేసేవారు. .. కానీ ఈ సారి ఆ పరిస్థితిలేదు.. కనీసం దుక్కులు చదువును చేసుకునే వర్షాలు కూడా పడలేదు.. అడపాదడపా ఎక్కడైన చిన్న వానలు పడి విత్తనాలు వేస్తే మొక్కదశలోనే ఎండిపోయే పరిస్థితి ఉంది.. ఈ క్రమంలో రైతులు కనిపించిన దేవునికల్లా మొక్కుతున్నారు. దేవుడా వర్షాలు కురిపించు అని వేడుకుంటున్నారు.
తెలంగాణాలో వానకోసం ప్రజలు కనిపించిన దేవునికల్లా మొక్కుతున్నారు. వర్షాలు కురిపించాలనిపూజలు చేస్తున్నారు. కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. గుడిలో దేవుళ్ల విగ్రహాలకు నీళ్లతో అభిషేకం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వర్షాలు లేక రైతులు, ప్రజలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. విత్తనాలు విత్తే సమయం దాటి పోతుండటంతో దిగాలు పడ్డ రైతన్న వర్షాలు పడాలని దేవుండ్లను వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ లో పోత లింగన్న ఆలయంలో స్వామికి మహిళలు పూజలు నిర్వహించారు. నీళ్లబిందెలతో అభిషేకం చేశారు. చుట్టుకాముడి ఆడి.. దేవుడా వానలు కురిపించుకు అని వేడుకున్నారు.
వానలకోసం నిర్మల్ జిల్లా రైతులు దేవుళ్లకు పూజలు చేశారు. వర్షాలు కురవాలని తిరుపతికి వెళ్లి వెంకన్నకు పూజలు నిర్వహించారు. కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లి వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు పండేలా చూడాలని వేడుకున్నారు.
వర్షాలు కురవాలని కోరుతు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గంగాదేవినికి జలాభీషేకం చేశారు మహిళలు. బయ్యారం మండల కేంద్రంలో ని గంగాబజారు గంగాదేవి గుడిలో గంగా దేవతకు ప్రత్యేక పూజులు చేశారు. ఆలయ ఆవరణలో పాటలు పాడుతూ కోలాటం వేశారు. వర్షాలు కురువాలని, పంటలు పండాలని, బయ్యారం పెద్ద చెరువునిండాలని గంగాదేవిని వేడుకున్నారు. గంగాదేవుని జలభీషేకానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.
