హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని సివిల్ సప్లయ్స్ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 సెంటర్లలోని 4వేల సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 52 లక్షల టన్నులను దాటేసి ఇప్పటికే 70.06లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు చేసినట్లు వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10.50 లక్షలకు పైగా రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.13,254 కోట్ల నిధులను జమ చేసినట్లు చెప్పింది. గతేడాది ఇదే టైంకు 70.04 లక్షల టన్నులు కాగా ఈ యేడు దాన్ని దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు 95 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
