- కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో అసాధారణంగా పెరుగుతున్న పెండింగ్కేసులను దృష్టిలో పెట్టుకొని జడ్జిల సంఖ్యను పెంచాలని తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(టీహెచ్‌సీఏఏ) కోరింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో సంఘం అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి వినతి పత్రం అందజేసింది.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు, సమర్థమైన న్యాయపాలన అందించేందుకు హైకోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్వైస్ప్రెసిడెంట్డీఎల్.పాండు, సెక్రటరీ పి.శ్రవణ్ కుమార్ గౌడ్, జాయింట్సెక్రటరీ పి.కృష్ణ కీర్తన, ట్రెజరర్బి.బాలాజీ, క్రీడలు, -సాంస్కృతిక విభాగం సెక్రటరీ జె.విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
