హైదరాబాద్, వెలుగు: డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సిఫార్సుల మేరకు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్లు ఇవ్వవచ్చునని అయితే అవి తాము ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 26 ప్రకారం తాను దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించకుండానే దేవాదాయ శాఖ కమిషనర్, సీనియార్టీ జాబితాను ప్రకటించడం చెల్లదని పేర్కొంటూ సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ గణేశ్ ఆలయ ఈవో ఎం. రామకృష్ణారావు వేసిన పిటీషన్‌ను జస్టిస్ టి. మాధవిదేవి గురువారం విచారించారు.
