మైనర్ బాలిక అబార్షన్ కు  హైకోర్టు అనుమతి

మైనర్ బాలిక అబార్షన్ కు  హైకోర్టు అనుమతి

హైదరాబాద్: అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చడంతో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక, ఆమె తల్లి కోరిక మేరకు అబార్షన్ చేయాలంటూ తీర్పు వెలువరించింది. 16 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై ఆపై గర్భం దాల్చడంతో బాధితురాలు ఆమె తల్లి ఆస్పత్రిలో అబార్షన్ చేయాలని కోరగా.. వైద్యులు నిరాకరించారు. దీంతో బాధితురాలు ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. 

కేసు విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు బాలికకు ఉందని స్పష్టం చేశారు. లోపల పిండం హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని ఆయన పేర్కొంటూ నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాలిక 26వారాల పిండాన్ని తొలగించాలని కోఠి కాన్పుల ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.