భగీరథ్ ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్మిస్‌

భగీరథ్ ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్మిస్‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బండి సాయి భగీరథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్టు అయినందున ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరర్ధకమని, ఈ వ్యవహారంపై ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ భగీరథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు.

ఈ వ్యవహారంపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టి, పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకునేందుకు అనుమతించారు. పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపసంహరణకు అనుమతిస్తూ దాన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. కింది కోర్టులో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిలు పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతిస్తూ ఆదేశాలను వెలువరించారు.