- వైద్య సేవలపై మరోసారి సమగ్ర వివరాలతో వేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఆధార్ కార్డు అవసరమా లేదా అనే అంశంపైనే కౌంటర్వేయడం ఏంటని ప్రశ్నించింది. ప్రతి అంశంపై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలా అని ప్రశ్నించింది. మరో అవకాశం ఇస్తున్నామని.. గత ఆదేశాల మేరకు వైద్య సేవలపై సమగ్ర వివరాలతో కౌంటర్దాఖలు చేయాలని సూచించింది
. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి కిడ్నీ, తదితర వ్యాధులకు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. సహాయకుడు లేడని, బాధితుడి వద్ద ఆధార్ కార్డు లేదని వైద్యం నిరాకరించడంతో అతను మూడు రోజులపాటు ఆస్పత్రి క్యాంటీన్ పరిసరాల్లో ఉండి స్పృహ తప్పి పడిపోయారు. చనిపోయాడని భావించి మార్చురీకి తరలించగా.. మరుసటిరోజు స్వీపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రవిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందేలా చూశారు. ఈ ఘటనపై న్యాయవాది కొమురయ్య రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుని విచారణ చేపట్టింది.

