హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీడ్ మోడ ల్‌ను అనుసరిస్తే ఆఫ్రికా దేశాలు గణనీయమైన పురోగతి సాధించగలవని హార్టికల్చర్ వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని హార్టికల్చర్ వర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్, ప్రసాద్ సీడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘సీడ్ అవేర్‌నెస్ అండ్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్’ అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో రాజిరెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణ ఇప్పటికే ‘ గ్లోబల్ సీడ్ క్యాపిటల్’గా పేరు పొందిందని, రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో 450కు పైగా జాతీయ, అంతర్జాతీ య విత్తన సంస్థల భాగస్వామ్యంతో విత్తన పంటల సాగు జరుగుతోందని తెలిపారు. కూరగాయల విత్తనోత్పత్తిపై ఆఫ్రికా దేశాలకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సలహాలు అందించేందుకు వర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. ఆఫ్రికాలో సేంద్రియ విత్తన ధ్రువీ కరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.
అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ఆఫ్రికా భూసారం వినాశనానికి దారితీసే విధానాలను అనుసరించకూడదని సూచించారు. హార్టికల్చర్ పంటలకు నాణ్యమైన విత్తన ఉత్పత్తి పై శిక్షణ కోసం ఆఫ్రికా దేశాల పరిశోధకులు, విద్యా ర్థులు హార్టికల్చర్ వర్సిటీని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓపెన్ పొలినేటెడ్ కూరగాయల రకాల విత్తనోత్పత్తి సులభమైందని, ఆఫ్రికాలో ఇందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నైజీరియాకు చెందిన తారాబా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ జోషువా మార్క్ మకున్, ఆదేశ అగ్రిల్చర్ శాఖ పర్మినెంట్ సెక్రటరీ అలీ సారా సాబు దంజుమాతో పాటు 30 మంది ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.
