ఫిడే గ్రాండ్ స్విస్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ మరో విక్టరీ

ఫిడే గ్రాండ్ స్విస్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ మరో విక్టరీ

ఐల్‌‌‌‌ ఆఫ్​మాన్ (యూకే): ఇండియా యంగ్ గ్రాండ్​మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్‌‌‌‌ ఫిడే గ్రాండ్ స్విస్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో మరో విజయంతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో దూసుకెళ్తున్నాడు. సోమవారం జరిగిన ఐదో రౌండ్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ కజకిస్తాన్‌‌‌‌కు చెందిన రినట్‌‌‌‌ జుమబయెవ్‌‌‌‌ను ఓడించాడు. ఐదు రౌండ్లలో నాలుగు పాయింట్లతో  అమెరికా స్టార్‌‌‌‌‌‌‌‌ హికారు నకామురా, ఆండ్రీ ఎసిపెంకోతో కలిసి అగ్రస్థానంతో నిలిచాడు.

ఇదే రౌండ్‌‌‌‌లో విదిత్‌‌‌‌ సంతోష్​ రష్యాకు చెందిన నాజెర్‌‌‌‌‌‌‌‌తో డ్రా చేసుకోగా.. డి. గుకేశ్​ తోటి ఆటగాడు ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ నారాయణన్ చేతిలో ఓడిపోయాడు. విమెన్‌‌‌‌ సెక్షన్​లో ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి టాప్‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ అనా ముజిచుక్ (ఉక్రెయిన్‌‌‌‌)తో డ్రా చేసుకుంది.