తెలంగాణ ఎల్పీసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎల్పీసెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ఐటీఐ చదివిన వారు పాలిటెక్నిక్ కోర్సులో నేరుగా రెండో సంవత్సరంలో చేరేందుకు వీలుగా రాసే ఎల్పీ సెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల అయింది. రేపటి నుంచి ఈనెల 21 వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వంద రూపాయలు ఆలస్య రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నోటిఫికేషన్ విడుదల చేశామని.. పరీక్ష ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించలేదని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. పూర్తి వివరాలు వెబ్ సైట్:  sbtet.telangana.gov.in లో తెలుసుకోవాలని యన కోరారు.