
హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో, ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు. తాజాగా డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను ప్రారంభించారు. డాల్బీ మిక్సింగ్ స్టూడియోను కీరవాణి లాంచ్ చేయగా, సౌండ్ డిజైన్ స్టూడియోను శేఖర్ చంద్ర లాంచ్ చేశారు.
షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్‌కు కావాల్సిన అన్ని రకాల వసతులు స్టూడియోలోకి అందుబాటులోకి తీసుకువచ్చామని సారథి స్టూడియోస్ చైర్మన్ ఎంఎస్ఆర్‌వి ప్రసాద్ చెప్పారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీతో తమ ఫస్ట్ ప్రాజెక్టు ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం అని అన్నారు. నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్ తదితరులు పాల్గొన్నారు.